Site icon NTV Telugu

Hyderabad hotels: ఈ హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. వెలుగులోకి విస్తుగొలిపే నిజాలు..

Hyderabad Restorent

Hyderabad Restorent

Hyderabad hotels: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు రావడంతో బయట తినే వారి సంఖ్య పెరిగింది. వండుకునే ఓపిక లేక.. రెస్టారెంట్ ఫుడ్ తినాలనే కోరిక.. ఏదైనా కావొచ్చు.. కానీ ఈరోజుల్లో బయట తినే వారి సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. ఒక వేళ ఇంట్లోనే వండినా కూడా.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా లేకుండా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసే చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పది రూపాయలకు మించి ఖరీదు చేసినా.. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంలో పేరున్న రెస్టారెంట్లకే ప్రాధాన్యం ఇస్తారు. మరి రెస్టారెంట్లు, హోటళ్లు తమ కస్టమర్లకు నిజంగా కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా లేదా అన్నది ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన పరిశోధనల్లో తేలింది.

కుళ్ళిన మాంసం, గడువు ముగిసిన ఉత్పత్తులు, కల్తీ మసాలాలు, నాణ్యత లేని పదార్థాలు వాడతారు, చాలా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తారు. భాగ్యనగరంలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి. ఈ క్రమంలో, ఫుడ్ సేఫ్టీ అధికారులు కస్టమర్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో కృతుంగ, షా గౌస్, కామత్ వంటి ఐకానిక్ రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తనిఖీల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లలో ఆహార భద్రత నిబంధనలు సరిగ్గా పాటించడం లేదు. ఈ జాబితాలోని కొన్ని ప్రముఖ రెస్టారెంట్ల పేర్లను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి. కాగా.. అక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుందో వివరించే ఫొటోలను కూడా షేర్‌ చేశారు.

ఆ రెస్టారెంట్లు ఇవే..

క్రీమ్ స్టోన్, నేచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ , KFC , రోస్టరీ కాఫీ హౌస్ , రాయలసీమ రుచులు , షా గౌస్ , కామత్ హోటల్ , 36 డౌన్‌టౌన్ బ్రూ పబ్, మకావు కిచెన్ మరియు బార్ , ఎయిర్ లైవ్, టాకో బెల్ , ఆహా దక్షిణ, సిజ్లింగ్ జో, ఖాన్ సాబ్ , హోటల్ సుఖ్ సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, కృతుంగ, విశ్రాంతి లేదా బార్,

Exit mobile version