Site icon NTV Telugu

Bhagavantha Rao: సీఎం కు బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదు?

Bhagavantha Rao

Bhagavantha Rao

CM attention on Bathukamma festivals.. Why not Vinayaka festivals? Bhagavantha Rao is serious: బతుకమ్మ ఉత్సవాల పై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాల పై ఎందుకు లేదు? అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు మండిపడ్డారు. 9వ తేదీన నిమజ్జనం జరుగుతుందని, అనంత చతుర్దశి రోజున చేయాలని ఆయన తెలిపారు. శుక్రవారం నిమజ్జనం చేయవద్దని వదంతులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, హై కోర్ట్ ఆదేశాలు ఎప్పటిలానే నిమజ్జనం చేసుకోమని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫో లేదని, పాండ్స్ ఏర్పాటు విషయంలో క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు. పాండ్స్ దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్సవాలను వ్యతిరేకించే వారు అక్కడ ఉంటే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. నిమజ్జనం విషయంలో పోలీసుల నుండి ఎలాంటి వత్తిడి తీసుకరావద్దని విజ్ఞప్తి చేశారు. బాలాపూర్ గణేష్ వారికి కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారని, వినాయక సాగర్ లో నిమజ్జనం వద్దని చెప్పడం విడ్డూరంగా వుందని అన్నారు. నిమజ్జనం వల్ల పొల్యూషన్ ఏర్పడుతుందని అంటున్నారు. దీనివల్ల ఎలాంటి కాలుష్యం జరగదని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాల పై ఎందుకు లేదు? ప్రభుత్వం, సీఎం జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి అపశృతి జరిగిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిమజ్జనంకు ముఖ్య అతిథిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వస్తున్నారని తెలిపారు.

Exit mobile version