NTV Telugu Site icon

CMR: ‘మన ఊరు-మన బడి’కి సీఎంఆర్‌ రూ.50 లక్షల విరాళం

Cmr

Cmr

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు – మన బడి పథకాన్ని తీసుకొచ్చింది.. సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు ఉద్దేశించిన ‘మన ఊరు- మన బడి’ పథకం కింద ఇప్పటికే ఎన్నో స్కూళ్లు కొత్త రూపును సంతరించుకున్నాయి.. అయితే, ఈ పథకానికి సీఎంఆర్‌ యాజమాన్యం భారీ విరాళం అందజేసింది…

Read Also: IND vs AFG: అఫ్ఘాన్‌పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్‌లో భువి అదుర్స్

సీఎంఆర్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ మాపూరి వెంకటరమణ వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక దృక్పథంతో తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు.. ఇటీవల ఖమ్మంలో సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ 19వ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా… ఖమ్మం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే మన ఊరు మన బడి కార్యక్రమానికి ఉద్దేశిస్తూ.. రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీసీ గౌతమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్ సురభి, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ నీరజ సమక్షంలో.. రూ.50 లక్షలకు సంబంధించిన చెక్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కు అందజేశారు సీఎంఆర్‌ ఫౌండర్‌ మాపూరి వెంకటరమణ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాపూరి మోహన్‌ బాలాజీ..