NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభలో పాల్గొననున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 కు ముఖ్యమంత్రి హన్మకొండ కుడా గ్రౌండ్స్ హెలిపాడ్‌కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. మధ్నాహ్నం 3:20కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి మాట్లాడుతారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి అక్కడే శంకుస్థాపన చేస్తారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, భీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.సాయత్రం 5.10 హెలికాప్టర్ లో హైదారాబాద్ కి తిరిగి వెళతారు.

Read also: Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీ-రిలీజ్ గెస్టులు వీరే..!

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో కాలేజీ కళాక్షేత్రం సుందరంగా ముస్తాబు చేశారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సుమారు లక్ష మంది మహిళలతో సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా నగరంలోని పలు ప్రభుత్వ ఆఫీసు లైట్టింగ్ తో అలంకరించారు. ముఖ్యమంత్రి కి స్వాగతం పలుకుతూ నగరంలో భారీ ఎత్తున ఫిక్సీలు ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. సీఎం రానున్న నేపథ్యంలో వరంగల్ లో పోలీలసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా అడుగడుగున పోలీసులు మోహరించారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని ప్రయాణికులు వేరే మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. పోలీసులకు ప్రయాణికులు సహకరించాలని సూచించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Show comments