CM Revanth Reddy: రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ లోక్ సభ నియోజకవర్గాల్లో విజయభేరి మోగించాలనే ఉత్సాహంతో ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తరచూ బహిరంగ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మిగిలి ఉండడంతో హస్తం పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మక్తల్, షాద్ నగర్, గోషామహల్ నియోజకర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ జన జాతర సభకు హాజరు కానున్నారు.
Read also: Amit Shah: నేడు పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా ప్రచారం..
సాయంత్రం 5.30 గంటలకు షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 6.45 గంటలకు గోషామహల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. రాత్రి 8.30 గంటలకు తాజ్ కృష్ణలో మీట్ ది ప్రెస్ లో పాల్గొంటారు. కాగా.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు తాజ్ కృష్ణలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ జన జాతర సభకు హాజరుకానున్నారు ఖర్గే. రేపు 11వ తేదీ ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో జరిగే ఎన్నికల సభల్లో ఏఐసీసీ అధినేత్రి ప్రియాంక గాంధీ పాల్గొంటారు.
