Site icon NTV Telugu

CM Revanth Reddy: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా వారికి కీలక అభ్యర్థన చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ అభినందనలు తెలిపారు.

విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల అమలుకు కృషి చేయాలని కోరారు. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి కూడా 4 ఎంపీ సీట్లు ఉండగా, రెట్టింపు 8 స్థానాలకు చేరుకున్నాయి. దీన్ని బట్టి ఈ దశలో తెలంగాణ, ఏపీలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
Maharastra : కేంద్ర మంత్రి పదవిని తిరస్కరించిన ఎన్సీపీ..మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు

Exit mobile version