Get to Gather: ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Get to Gather: విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారని అన్నారు. తాము పాలకులం కాబట్టి, పోలీసులను సబ్‌ఆర్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకుపోతామని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పునర్ నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని సీఎం అన్నారు.
Read also: Saranya Pradeep: అంబాజీపేటలో హీరో సూహాస్ కాదు.. శరణ్యనే.. అసలు ఏమన్నా యాక్టింగా?
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
గత పదేండ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీస్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు. యువతీ, యువకులను డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేయాలన్నారు. రోజురోజుకు సైబర్ క్రైమ్స్ అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టెందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. పోలీసుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
Grama Panchayathi: నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన.. ప్రభుత్వం జీవో జారీ
తాజావార్తలు
-
Karuppu Success Meet: ‘కరుప్పు 2’పై సూర్య బిగ్ హింట్..
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
-
Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్‌లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
-
Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?