అసెంబ్లీ సమావేశాలపై సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు శాసనసభ నిర్వహించాలని.. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు, ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంచాలి…జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని… ప్రభుత్వం తరఫున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం సూచనలు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చేరవేయాలని…అర్ధవంతమైన, ముఖ్యమైన అంశం అయితే కావలసినంత సమయం కేటాయించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణా అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన !
