Site icon NTV Telugu

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం గా సిఎం తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు సుఖ శాంతులతో ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.

Exit mobile version