NTV Telugu Site icon

CM KCR: రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు

Cm Kcr

Cm Kcr

CM KCR: రంగుల పండుగ హోలీని జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగ జరుపుకోనున్నారు. హోలీ పండుగ విషయానికొస్తే.. ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలో అనే సందిగ్ధత ఏర్పడింది, అయితే మంగళవారం సాయంత్రం కామ దహనం చేయాలి, బుధవారం హోలీ పండుగ జరుపుకోవాలి. అయితే చాలా మంది రెండు రోజులూ హోలీని జరుపుకుంటారు. ఈనేపథ్యంలో హోలీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించింది. ఇదిలావుండగా, పచ్చని మొగ్గతో పునరుజ్జీవింపబడి, కొత్త మార్గంలో పునఃప్రారంభమయ్యే ప్రకృతి చక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి కొత్తదనాన్ని హోలీ రూపంలో స్వాగతించే భారతీయ సంప్రదాయం ఎంతో అందంగా ఉంటుందని అన్నారు.

Read also: Attack on Petrol Bunk: ఇదెక్కడి ఘోరం.. బైక్‌ లో పెట్రోల్‌ పోసి డబ్బులు అడిగినందుకు చంపేశారు

ఈసందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ నేపథ్యంలో చిన్నారుల జాజిరీలు, వెన్నెల నవరాత్రుల కోలాటాల చప్పట్లతో పల్లెలు హోరెత్తుతాయని చెప్పారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కేరింతలు కొట్టి జరుపుకునే హోలీ మానవ జీవితం ఒక వేడుకగా భావించి ప్రకృతితో మమేకమై జీవించే తత్వాన్ని ఇస్తుందని అన్నారు. ప్రజలంతా భిన్నాభిప్రాయాలు పక్కనపెట్టి బంతిపూల వంటి సహజ రంగులతో హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, పరస్పర ప్రేమ, ఆప్యాయతలను చాటుకోవాలని ఆయన కోరారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ తెలంగాణలోని దళిత, బహుజన, సకలజనుల జీవితాల్లో నింపిందని అన్నారు. దేశంలోని ప్రజలందరి జీవితాల్లో కొత్త జీవితం వెల్లివిరిసే వరకు తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తగు జాత్ర్తలు పాటిస్తూ హోలీ జరుపుకోవాలని, రంగులు కళ్లల్లో పడకుండా, పిల్లలకు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు చప్పాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Bandi sanjay: తెలంగాణ భవిష్యత్తును మార్చేందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు

Show comments