Site icon NTV Telugu

CM KCR: నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం.. ధరణీ సమస్యలపై చర్చ

Cm Meeting With Collector,s

Cm Meeting With Collector,s

CM Meeting With Collector,s: ఇవాళ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. డిసెంబర్‌ లో అసెంబ్లీ సీతాకాల సమావేశం జరుగనుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ లో ప్రధానంగా ధరణీలో సమస్యల పరిస్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌. దీంతో కలెక్టర్లు ఇప్పటికే గ్రామాల వారిగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read also: Thalapathy Vijay: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ…

ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి బయల్దేరనున్న సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. నేడు నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మితమవుతున్న యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. రూ.29,965 కోట్లతో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా 5 యూనిట్లను నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వెలుగులు పంచనుంది. ఇది దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో మొదటిది. ఈ నేపథ్యంలో యాదాద్రి నిర్మాణ పనులపై రాష్ట్ర జెన్‌కో పురోగతి నివేదికను అందజేసింది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు యాదాద్రి విద్యుత్‌ కేంద్రం కీలకమని, దీని నిర్మాణపనులను రాత్రింబవళ్లు పదివేల మంది కార్మికులు శరవేగంగా చేస్తున్నట్లు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. అయితే.. దీనికిచ్చిన పర్యావరణ అనుమతిని సమీక్షించి తిరిగి నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు నిర్మాణానికి ఆటంకం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ.. నిర్మాణం ఆపాలని ఎన్​జీటీ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
China Boy Watching TV: టీవీ చూస్తున్నాడని.. కుమారుడికి పేరెంట్స్ కఠిన శిక్ష

Exit mobile version