Site icon NTV Telugu

KCR Up Tour: ములాయం సింగ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్.. రాత్రి ఢిల్లీలో బస

Kcr Up Tour

Kcr Up Tour

KCR Up Tour: నేడు సీఎం కేసీఆర్‌ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లనున్నారు. నిన్న స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్‌ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు ఇవాళ మధ్యామ్నం సీఎం చేరుకుంటారు… దివంగత ములాయం సింగ్‌ యాదవ్‌ పార్థివ దేహానికి శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించి, అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. సీఎంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బయలు దేరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.

Read also: Astrology: అక్టోబర్ 11, మంగళవారం దినఫలాలు

గత వారం రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) ప్రాణాలు విడిచారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో గల మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రి మృతి చెందినట్లు కుమారుడు అఖిలేష్‌ యాదవ్ ట్వీట్ చేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన జీవిత కాలంలో 8సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1989లో తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కేంద్ర రక్షణ మంత్రిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా పదవిలో ఉన్నారు.
Astrology: అక్టోబర్ 11, మంగళవారం దినఫలాలు

Exit mobile version