Iftar Dawaat: రంజాన్ మాసం ముస్లిములకు ప్రవిత్రమైన మాసం. రంజాన్ సందర్బంగా.. తెలంగాణ సర్కార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఎల్బీనగర్ స్టేయంకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొననున్నారు. కాగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఇఫ్తార్ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరుకానున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడనుంది. దీంతో ఇఫ్తార్‌కు ముస్లింల రాక, కేసీఆర్ పర్యటన దృష్ట్యా ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
Read also: Sachin Pilot: ఢిల్లీకి సచిన్ పైలట్.. కాంగ్రెస్ పెద్దలను కలుస్తారా?
ట్రాఫిక్ మళ్లింపు..
నాంపల్లి చాపెల్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద పీసీఆర్ వైపు మళ్లిస్తారు. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి బషీర్‌బాబ్ ప్రెస్ క్లబ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, వాహనాలను రవీంద్ర భారతి మరియు హిల్ ఫోర్ట్ రోడ్ నుండి BJR విగ్రహం వైపు ఫతే మైదాన్‌లోని KLK బిల్డింగ్ వద్ద సుజాత హైస్కూల్ వైపు మళ్లిస్తారు. బషీర్ బాగ్ ఫ్లైఓవర్‌పై వచ్చే ట్రాఫిక్‌ను బిజెఆర్ విగ్రహం వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతించరు. ఈ వాహనాలు ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వరకు వెళ్లి చాపెల్ రోడ్డు వైపు కుడి మలుపు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నారాయణగూడ శ్మశానవాటిక వైపు నుంచి వచ్చే వాహనదారులను పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్‌నగర్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. కింకోటి, బొగ్గుల కుంట నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను కింకోటి కూడలిలోని తాజ్‌మహల్, ఈడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి పీసీఆర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.