NTV Telugu Site icon

Yadadri Temple: యాదాద్రిలో సీఎం కేసీఆర్.. ప్రత్యేక పూజలు

Kcr Yadadri

Kcr Yadadri

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్‌ దంపతులు. ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభించారు.తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా జరుగుతున్న ఉద్ఘాటన పర్వాలులో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. దర్శనం అనంతరం కేసీఆర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందచేశారు.

 

ఉదయం 10.25 గంటలను ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ చేశారు. అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టారు. అనంతరం మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్ఠాయాగ పరిసమాప్తి పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, విప్ ,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, సీఎంవో భూపాల్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వున్నారు. వీరితో పాటు వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ప్రధానార్చకులు నల్లందిగల్ నరసింహ చార్యులు, ఈవో గీత వున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చక బృందం.

Read Also: Warangal Sabha: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ