నల్గొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట విమాన శ్రయానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్… హెలికాఫ్టర్ ద్వారా ఉ.10.40 నిమిషాలకు హాలియా చేరుకోనున్నారు. నాగార్జున సాగర్ చేరుకున్న అనంతరం… ఉ.10.55 నిమిషాలకు మార్కెట్ యార్డ్ లో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.10 నిమిషాలకు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో లంచ్ చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తదనంతరం 2.10 నిమిషాలకు హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేయనున్నారు.
నేడు నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన

KCR