NTV Telugu Site icon

CM KCR Press Meet: బీజేపీ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం

Kcrr

Kcrr

ఇవాళ మీడియాను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మేకిన్‌ ఇండియా పథకం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశద్రోహులు అంటున్నారు. పాకిస్థాన్‌ మనకు అసలు సమస్యే కాదు. అది స్మాల్‌ ప్రాబ్లం. చైనాతోనే మనకు ముప్పు పొంచి ఉంది. స్విస్‌ బ్యాంకులోని డబ్బులను వెనక్కి తెస్తామన్నారు. కానీ అక్కడ డిపాజిట్లు డబుల్‌ అయ్యాయి. దీనికి ఎవరు బాధ్యులు. ఢిల్లీలో మాటలు చెప్పే ఇంజన్‌ వద్దు. పనిచేసే ఇంజన్‌ కావాలి. ఇండో చైనా బోర్డర్ ప్రయోగశాల కాదు. దేశం పరువు పోతోంది. బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడింది.

ఆ పార్టీకి పాలించే అర్హతే లేదు. బీజేపీ తప్పుకోవటమే దేశానికి మంచిది. మోడీ ఆకాశంలో నుంచి ఊడిపడ్డాడా?. గుజరాత్ అనేది దొంగ మోడల్‌. గోల్‌ మాల్‌ చేసి ప్రధాని అయిండు. నా లాగే మోడీ కూడా ఒకప్పుడు సీఎమ్మే. మేం బరాబర్‌ జాతీయ రాజకీయాలు చేస్తాం. అగ్నిపథ్‌ స్కీమ్‌ పెద్ద బ్లండర్‌. మోడీకి దేశం మీద ప్రేమ లేదు. కార్మికుల ఉసురు పోసుకుంటున్నారు. మోడీ ప్రభుత్వాన్ని మారుస్తాం. ఎల్‌ఐఎస్‌ని అమ్మనివ్వం. మన దేశ ఇజ్జత్‌ మొత్తం శ్రీలంకలో పోతోంది. భారత ప్రధానమంత్రి పదవి స్థాయిని దిగజార్చారు. దీనిపై మాట్లాడవేం మోడీజీ? ప్రతిపక్షాలపై నిఘా పెట్టడమే బీజేపీ పని.

బీజేపీ అరాచకాలను, దుర్మార్గాలను ఇట్లనే భరిస్తూ పోతే దేశం ఎటూ కాకుండా పోతుంది. చెడగొట్టడం చాలా ఈజీ. బాగుచేయటం కష్టం. యువకులు దేశాన్ని కాపాడుకోవాలి. అన్ని వర్గాలకూ దండం పెట్టి చెబుతున్నా. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఈ దేశం రియాక్ట్‌ అవుతుంది. చెంప దెబ్బ కొడుతుంది. కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో ఎన్టీఆర్‌ని దించటం కోసం నాదెండ్ల అనే ఏక్‌ నాథ్‌ షిండేని తెచ్చింది. తర్వాత తలదించుకోవాల్సి వచ్చింది. మోడీకి దమ్ముంటే ఏక్‌నాథ్‌ షిండేలాంటోణ్ని తెలంగాణకు తీసుకురావాలి. బీజేపీ విధానాలకు విరుగుడు కావాలి. లేకపోతే ఈ దేశం శతాబ్ద కాలం నష్టపోవాల్సి వస్తుంది.

నేను చెప్పేది అక్షరాలా వాస్తవం. సేనల్లో యువరక్తం కావాలంటున్నారు. మరి, కేంద్ర ప్రభుత్వంలో వద్దా?. దేశానికి ప్రాణమిచ్చే జవాన్‌ తయారుకావాలంటే ఏడెనిమిదేళ్లు పడుతుంది. దేశంలోని ఎన్నో రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందంజలో ఉంది. రాష్ట్రాన్ని డెవలప్‌ చేశాననే శాటిస్‌ఫ్యాక్షన్‌ నాకుంది. మేం పోరాటం చేసేటోళ్లం. భయపడేవాళ్లం కాదు. తెలంగాణలో ఎక్కడ అవినీతి జరుగుతోందో చూపించు. మోడీ పిట్ట బెదిరింపులకు భయపడం. నువ్వు నన్ను గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతూనే ఉంటా. రైతుల్ని ఉగ్రవాదులు అన్నందుకు క్షమాపణ చెప్పాలి.

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి. అది మీకు పూర్తి అర్థం కావట్లేదు. మోడీ విశ్వగురువా?. బీజేపీ మీద కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ మీద బీజేపీ బ్లేమ్‌ గేమ్‌ జరుగుతోంది. జీఎస్‌టీని ప్రవేశపెట్టిన చిదంబరమే దాన్ని వ్యతిరేకించాడు. అదేంటని నిలదీస్తే రాజకీయం అని చెప్పాడు. ఇదే పాలిటిక్స్‌?. కాశ్మీరీ ఫైల్స్‌ అనే సినిమా తీసి మాయ చేయాలని అనుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ జనరేషన్‌ ఈజ్‌ ఏ నేషన్‌ అని అమెరికా రాజ్యాంగ నిర్మాత పేర్కొన్నాడు. అవసరాలకు తగ్గట్లు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని సూచించాడు. ఆయన చెప్పినదాన్ని మనం పాటించాలి. బీజేపీ మాతో పెట్టుకుంటే అగ్గిపుట్టిస్తాం. దేశంలో ఎలాంటి మార్పులు రావాలో వివరిస్తాను. అవసరమైతే టీఆర్ఎస్‌ జాతీయ పార్టీగా మారుతుంది.