NTV Telugu Site icon

CM KCR: నేడు నల్గొండకు సీఎం కేసీఆర్.. సాయంత్రం దేవరకొండలో భారీ సభ..!

Cm Kcr

Cm Kcr

CM KCR: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్ నగర్, 3 గంటలకు మిర్యాలగూడ, సాయంత్రం 4 గంటలకు దేవరకొండలో జరిగే సభలకు సీఎం హాజరవుతారు. కాగా, నల్గొండలో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ బీఆర్‌ఎస్ నేతలకు బ్రహ్మాస్త్రం లాంటిది. దీన్ని ఉపయోగించుకునేందుకు ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ముందస్తుగా సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో రెండు రోజుల ముందే ప్రచారాన్ని పక్కనపెట్టి సీఎం సభకు జన సమీకరణ, ఏర్పాట్లు చేయడంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. సభకు సామాన్య ప్రజలతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేలు.. సీఎం భేటీ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారానికి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు కీలక మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలను ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే సీఎం పర్యటన షెడ్యూల్ వెల్లడి కావడంతో ఏర్పాట్లు, జన సమీకరణపై దృష్టి సారిస్తున్నారు.
Brahmanandam: ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం!