Site icon NTV Telugu

40 వేల కోట్లు దళితుల కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం

cm kcr

తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలి అని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికది గా సిద్ధం చేసుకోవాలి అని అన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం… సమిష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇక ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తున్నది అన్నారు. ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు స హకారం అందిస్తాం. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అంది పుచ్చు కోవడానికి, దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి…అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తది అని సీఎం కేసీఆర్ సూచించారు.

Exit mobile version