ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎ కేసీఆర్ వ్యవసాయరంగంపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగి ధాన్య సేకరణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు.
రైతుల సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తామన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించారు. రైతులు పత్తి, మిర్చి, కంది, వాటర్ మెలన్‌తో పాటు తదితర ప్రత్యామ్న్యాయ పంటల సాగును ప్రోత్సహించాలని కేసీఆర్ సూచించారు.
