Site icon NTV Telugu

ఎల్లుండి హుజూరాబాద్‌కు కేసీఆర్… అన్ని ఏర్పాట్లు పూర్తి

KCR

KCR

హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 16న నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పాలన పరమైన అంశాల్లో కేసీఆర్ వేగం పెంచారు. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సిద్దిపేట, మెదక్, వరంగల్ జిల్లాలను సందర్శించారు. వాస్తవానికి ఈనెల మొదటి వారంలో నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సింది ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాల పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల సందర్శనపై ప్రణాళికలు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

Exit mobile version