Site icon NTV Telugu

ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

cm kcr

50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. 13న జరిగే కేబినెట్ లో ఉద్యోగాల ఖాళీ, భర్తీ పై చర్చ జరగనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం అయిన ఆర్థిక శాఖ… గతంలో ఇచ్చిన ఖాళీ వివరాల పై సమీక్ష జరపనుంది. శాఖల వారిగా ఖాళీల ఫైనల్ జాబితా తీసుకున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్.. ఆయా శాఖలు ఇచ్చిన ఖాళీల వివరాలను క్రోడీకరించి కేబినెట్ ముందు పెట్టనుంది ఆర్థిక శాఖ. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ అనేది కేబినెట్ మీటింగ్ తర్వాత క్లారిటీ వస్తుంది అంటున్నారు అధికారులు.

Exit mobile version