NTV Telugu Site icon

క‌లెక్టర్ల‌తో సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం…జులై 1 నుంచి…

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో సాధార‌ణ జీవ‌నం వైపు అడుగులు వేస్తున్నారు.  ఒక‌వైపు వేగంగా వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది.  సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటుండ‌టంతో, ప్ర‌భుత్వం అభివృద్ధిపై దృష్టిసారించింది.  సీఎం కేసీఆర్ ఈరోజు జిల్లాల క‌లెక్ట‌ర్లు అధికారుల‌తో స‌మావేశం అయ్యారు.  పల్లె, పట్టణ ప్రగతి, హ‌రిత‌హారంపై సీఎం  సమీక్షను నిర్వ‌హించారు.  జులై 1 నుంచి రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి.  ఏ పని కూడా పెండింగ్ ఉండటానికి వీల్లేదని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  

Read: ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు, రెండు సినిమాలు… ఓ కియారా!

పెండింగ్ పనులు ఏమైనా ఉంటే పునఃసమీక్ష చేసుకోవాలని అన్నారు.  ఇక గ్రామాల్లో డోర్ టు డోర్ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని అన్నారు.  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందిన‌ద‌ని, రైతులకు అండగా నిల‌బ‌డాల‌ని, రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవ‌స‌ర‌మ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.