NTV Telugu Site icon

Independence Celebrations: నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Independence Celebrations

Independence Celebrations

Independence Celebrations: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఆగస్టు 3న ప్రగతి భవన్‌ లో కమిటీతో సమావేశ మైన విషయం తెలిసిందే. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై కమిటీతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. 75వ స్వాతంత్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈనేపథ్యంలో తొలిరోజు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగే భారీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీటిని ప్రారంభించనున్నారు. ఈకార్యక్రమంలో.. శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నగరపాలక మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు పాల్గొననున్నారు. వజ్రోత్సవాలు సందర్భంగా 85 మంది వీణ కళాకారులతో దేశభక్తి గీతాలు, ఇసుక కళలో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు, మహిళా యోధుల జీవితాలపై పద్మశ్రీ అలేఖ్య పుంజల ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన, లేజర్‌షో, దేశభక్తి గీతాల ప్రదర్శనలుంటాయి. స్వతంత్ర వజ్రోత్సవాలపై కేసీఆర్‌ సందేశమిస్తారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా వేడుకలు ఉండాలని సీఎం తెలిపారు. ప్రతి గుండెలో భారతీయత నిండేలా చూడాలని సీఎం అన్నారు. సమున్నతంగా, అంగరంగ వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరపాలని ఆదేశించారు. హెచ్‌ఐసీసీలో ప్రారంభ సమారోహం, ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం వుంటుందని, అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వుంటుందని సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది.

వజ్రోత్సవాల షెడ్యూల్‌:

ఆగస్టు 08 : స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ఆగస్టు 09 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం
ఆగస్టు 10 : వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామ గ్రామాన మొక్కలు నాటడం., ఫ్రీడం పార్కుల ఏర్పాటు
ఆగస్టు 11 : ఫ్రీడం రన్ నిర్వహణ
ఆగస్టు 12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
ఆగస్టు 14 : సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం
ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆగస్టు 16 : ఏక కాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సమూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ
ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ
ఆగస్టు 18 : ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
ఆగస్టు 19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణీ.
ఆగస్టు 20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు.
ఆగస్టు 21 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
ఆగస్టు 22 : ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.

Show comments