CM KCR: పేద బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో గోపన్నపల్లిలో 6.10 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో విప్రహిత బ్రహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతీనెల పేద బ్రాహ్మణులకు ఇచ్చే భృతిని రూ. 2500 నుంచి రూ. 5000 లకు పెంచుతున్నామని ప్రకటించారు. బ్రహ్మ జ్ఞానం పొందిన వారికి బ్రహ్మనిజం సిద్ధిస్తుందని అన్నారు. ద్వాదశ జ్యోతిర్లాంగాల నుంచి వచ్చిన అర్చకులకు పాదాభివందనలు చేశారు. కులానికి పెద్దదైన బ్రహ్మణుల్లో కూడా పేదవారు ఉన్నారని కేసీఆర్ అన్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
Read Also: Ashish Vidyarthi : ఆశిష్ విద్యార్ధి మరో పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా..?
పేద బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ. 150 కోట్లు వెచ్చించామని తెలిపారు. రంగారెడ్డిలో ప్రారంభించిన బ్రాహ్మణ సదన్ దేశంలో మొట్ట మొదటి బ్రహ్మణ సదనం అని ఆయన తెలిపారు. సూర్యాపేటలో కూడా త్వరలోనే బ్రహ్మణ సదన్ నిర్మించుకుందాం అని అన్నారు. దీపదూప నైవేధ్యం కోసం ఇచ్చే రూ. 6 వేలను రూ. 10,000కు పెంచుతున్నామని ప్రకటించారు. ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర పీఠాధిపతులు, పండితులు హాజరయ్యారు.
