Site icon NTV Telugu

Independence Celebrations: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో ఆకట్టుకున్న కళాప్రదర్శన

Independance Day

Independance Day

Independence Celebrations: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ ఉత్సవాలు 15 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈకార్యక్రమంలో.. శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నగరపాలక మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు పాల్గొననున్నారు.

read also: Srikakulam Farmers Problem: అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హెచ్​ఐసీసీలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వజ్రోత్సవాలు సందర్భంగా 75 మంది కళాకారులతో నిర్వహించిన వీణావాయిద్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. శాండ్‌ ఆర్ట్‌తో స్వతంత్ర పోరాట ఘట్టాల ప్రదర్శన అందర్ని భావోద్వేగానికి గురి చేసింది. వేదికపై దేశభక్తి ప్రబోధ నృత్యం, ఫ్యూజన్ డ్యాన్స్, లేజర్ షో అలరించాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

https://www.youtube.com/watch?v=ebETLVQtoUE

 

Exit mobile version