NTV Telugu Site icon

CM KCR: జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ

Kcr Cm

Kcr Cm

CM KCR: జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణ దశాబ్ది వేడుకలు సందర్భంగా.. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తుందన్నారు.

జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ లో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్‌ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రం హర్ ఘర్ జల్ యోజన పథకం నూటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. స్వచ్ఛ మైన తాగు నీరు అందించడం లో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడవ స్థానంలో ఉందన్నారు. 80 శాతం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తంయ్యిందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పైగా పూర్తయ్యాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో సీత రామ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకుందని తెలిపారు. త్వరలో ప్రాజెక్టు పూర్తి అవుతుందని సీఎం అన్నారు. రైతు బంధు పథకం వారి కళ్లను సైతం తెరిపించిందని చురకలంటించారు. రైతు బంధు పథకం కేంద్ర పాలకుల కళ్లను సైతం తెరిపించిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రం రైతు బంధు పథకంను అనుసరించక తప్పలేదని సీఎం తెలిపారు.