NTV Telugu Site icon

CM KCR: కుల-మతపిచ్చితో విద్వెషాలు రెచ్చగొడితే.. రాష్ట్రం తాలిబన్ల మాదిరి మారుతుంది

Cm Kcr Fires On Bjp

Cm Kcr Fires On Bjp

CM KCR Fires On Central Govt In Mahabubabad Event: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులపిచ్చి, మతపిచ్చితో కేంద్రంలోని బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రం తాలిబన్ల మాదిరిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ఈరోజు నుంచే ప్రతిచోట యువత మేధావులు చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. 14న్నర లక్షల కోట్లు ఉండాల్సిన మన తలసరి ఆదాయం.. ఇప్పుడు 11 లక్షలకు పడిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తే.. తెలంగాణ రాష్ట్ర ఆదానం పెరిగేదన్నారు.

Army Chief: సరిహద్దులో చైనా బలగాలు పెరిగాయి.. అన్నింటికి సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్

ప్రాజేక్టుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తోందని.. 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పులకే పోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. పట్టుబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకొని.. మండువేసవిలో సాగు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేసుకున్నామన్నారు. ఉద్యమ సందర్భంలో తాను మహబూబాబాద్‌కు వచ్చానని.. సగం గీకి గోకి ఉన్న కాలువలను చూసి నీళ్ళు రావనుకునేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం కాళేశ్వరంకు పోయినప్పుడల్లా.. చిల్లర డబ్బులు గోదావరిలో వేసి, మా నేలమీదికి ఎప్పుడొస్తావని తల్లి గోదావరిని వేడుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. మహబూబాబాద్ చాలా వెనుకబడిన ప్రాంతమని.. దీంతోపాటు ములుగు, భూపాలపల్లిలో వెలుగులు రావాలని పట్టుబట్టి జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గతంలో నాలుగైదు మేడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

Nandamuri Balakrishna: వీరసింహారెడ్డి కి షాక్.. నెట్టింట సినిమా మొత్తం లీక్

మహాబూబాబాద్‌కు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నానని తెలియజేసిన కేసీఆర్.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభిస్తామని అన్నారు. మొత్తం 461 గ్రామపంచాయతీలు ఉన్నాయని.. అందులో 261 గ్రామ పంచాయతీల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి పది లక్షల చొప్పున మంజూరు చేస్తున్నానన్నారు. మహాబూబాబబాద్ మున్సిపాలిటీ రూ. 50 కోట్లు, మిగతా మూడు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.

KL Rahul – Athiya: కేఎల్ రాహుల్, అథియా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఈ నెల్లోనే!

Show comments