Site icon NTV Telugu

ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్‌

kcr

తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం లో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాల తో అభివృద్ది లో తెలంగాణ పోటీ పడుతూ, నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి అర్పిస్తున్నదని సీఎం కెసిఆర్ తెలిపారు.

Exit mobile version