వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు,తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ కి పోచంపల్లి ధన్యవాదాలు తెలిపారు.
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
