శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ శ్రీరామానుజ విగ్రహాన్ని అవిష్కరించారు. అయితే తాజాగా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి జగన్ చేరుకోనున్నారు. అనంతరం చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో జగన్ పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి 9.05 గంటలకు తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
