KishanAgro Feed Company: ఆధునిక ప్రపంచంలో మనుషుల తినే తిండి ఆరోగ్యాన్ని ఇవ్వడం మాట అటుంచి అందులోని హానికారక రసాయనాల మూలాన వారి ఆరోగ్యం, ఆయుష్షుతో చెలగాటమాడుతూ రోగాల కుంపటిగా మారుస్తోంది. అయితే.. మనం రోజువారీ తినే ఆహార పదార్థాలే కాదు, పండ్లూ, ఫలాలు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి అవసరమైన మందులు, మరీ ముఖ్యంగా గ్లూకోజ్ లాంటి ప్రాణాలను రక్షించే వాటితోపాటు అనేక వినియోగ వస్తువుల్లో 90% కల్తీలే రాజ్యమేలుతున్నాయి. ప్రతి వంటగదిలో తప్పనిసరిగా ఉండే బియ్యం, ఉప్పు, పప్పు, పసుపు, కారం, నూనె-నెయ్యి, పాలు-పెరుగు, తేనె, అల్లం, వెల్లుల్లి, మసాలాలు, మైదా, గోధుమలు, శెనగపిండిలో కల్తీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. సబ్బులు, పౌడర్లు, క్రీములు వంటి కాస్మోటిక్స్ కూడా కల్తీ చేసి రోగాలుగా మారుతున్నాయి. వ్యసనాలలో భాగంగా వినియోగించే పొగాకు, సిగరెట్లు, గుట్కా, స్వదేశీ, విదేశీ మద్యంలో కల్తీ చేయడం గుర్తించలేని స్థితికి చేరుకుంది.
Read also: Kidnapping: చాకెట్లు కొనిస్తానని కిడ్నాప్.. చాకచక్యంగా బయటపడ్డ చిన్నారులు
కల్తీకి ఎక్కువగా ఆహార పదార్థాలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం వాటిని సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ వాడడమే. సోడియం హైడ్రోసల్ఫైట్, బ్లాక్ ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్, కార్బైడ్, సింథటిక్ గమ్, కృత్రిమ రంగులు, యూరియా, మైనపు, సీసం, క్రోమేట్ తదితర రసాయనాలు, చాక్ పీస్ పౌడర్, డిటర్జెంట్, గంజి, రాళ్లు, రంపపు పొడి, జంతువుల ఎముకల మిశ్రమాలను ఉచితంగా కలుపుతున్నారు. వీటి వల్ల ప్రజలు గుండె, శ్వాసకోశ, మూత్రనాళ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అధిక డిమాండ్ మరియు అధిక ధరల కారణంగా, అనేక వస్తువుల నకిలీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. మధ్యతరగతి, పేద వర్గాలు ఉండడంతో స్వార్థపరులు, హోల్‌సేల్, చిల్లర వ్యాపారులు ఆహార పదార్థాలను కల్తీ చేసి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చోటుచేసుకుంది.
Read also: Chain Snatching: ఓరేయ్ ఎంట్రా ఇదీ.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ దొంగతనాలు ఎంట్రా బాబు
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో కిషన్ఆగ్రో ఫీడ్ కంపెనీ పేరు తో కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. అయితే ఆ కంపెనీలో పశువుల ఎముకలతో తీసే రసాయనాలు తయారు చేస్తున్నారని వాటి ద్వారా దుర్వాసన వస్తుందని ప్రజలు ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆదుర్వాసన వల్ల పిల్లలు పెద్దలు రోగాల బారిన పడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఈకంపెనీని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మూడురోజులుగా నిరాహార దీక్షచేస్తున్నా ఎవరు స్పందించడం లేదని పశువుల ఎముకలతో తీసే రసాయనలను వెంటనే సీజ్ చేయాలనీ కోతపల్లి తకళ్ళపల్లి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు, కొంతమంది ప్రజా ప్రతినిధులు అండదండలతో రెండుసార్లు సీజ్ చేసిన మళ్ళీ ఓపెన్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆకంపెనీని అనుకోని 4 గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Telangana Assembly: గవర్నర్ బడ్జెట్ ప్రసంగం.. నేడు ధన్యవాద తీర్మానం
దానివల్ల వచ్చే దుర్వాసన సమస్యతో చాలా బాధపడుతున్నామని వాపోతున్నారు. రాత్రి సమయంలో ఎక్కువగా దుర్వాసన రావటంతో చిన్న పిల్లలకు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. MLA మంచి రెడ్డి కిషన్ రెడ్డికి ఎన్ని సార్లు చెప్పున పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ తీసేంత వరకు ఆందోళన, నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అయితే.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆహార కల్తీని నివారించడానికి ఎన్ని చట్టాలు చేసినా, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా, జాతీయ, రాష్ట్రజిల్లా స్థాయి యంత్రాంగాన్ని రూపొందించినా ఆశించిన స్థాయిలో కల్తీ కోరల నుంచి వినియోగదారులను ప్రభుత్వాలు కాపాడలేకపోతున్నాయి.