Wine Shop Closed: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9న షెడ్యూల్ విడుదల కాగా, ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల వేళ ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 50 వేలకు పైగా నగదు తీసుకెళ్తున్న వారు సరైన ఆధారాలు లేకుంటే డబ్బులు దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 కోట్ల రూపాయల నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అక్రమ మద్యం, బంగారం, వెండిని వదలకుండా పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే తెలియకుండా సొమ్ము తీసుకుంటున్న కొందరు సొమ్ములు కూడా పోగొట్టుకుంటున్నారు.. కొన్ని సార్లు అన్ని డాక్యుమెంట్లు ఉన్నా.. అనుమానం ఉంటే అలాంటి వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కాగా, హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున డబ్బులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
అయితే మద్యం విక్రయాలు, వైన్ షాపులకు సంబంధించిన డబ్బులు కూడా ఇందులో ఉంటాయని వైన్ షాపు సంఘం ప్రతినిధి నాగుల ప్రభాకర్ తెలిపారు. మద్యం దుకాణాలు, బార్ల విక్రయ కౌంటర్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అన్యాయంగా సీజ్ చేస్తున్నారని ప్రభాకర్ వివరించారు. అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు.. కేవలం 5 రోజుల వ్యవధిలోనే 56 వైన్ షాపులకు సంబంధించిన డబ్బులను పోలీసులు అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల వివరాలతో పాటు షాపు లైసెన్స్ పేపర్లను కూడా చూపించి నగదును స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రభాకర్ తెలిపారు. అంతేకాదు.. కొందరు పోలీసులు మఫ్టీలో వచ్చి మద్యం షాపుల దగ్గర దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ప్రభాకర్ ఆరోపించారు. పోలీసులు ఇలాగే దుర్భాషలాడుతూ అన్యాయంగా డబ్బులు లాక్కుంటే తెలంగాణలో ఎన్నికల వరకు మద్యం షాపులను బంద్ చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగి వివరాలు, షాపు లైసెన్స్ పేపర్లు చూపించినా డబ్బులు సీజ్ చేస్తే దుకాణాలు బంద్ చేయడం మంచిదని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వేల కోట్ల టర్నోవర్ ఇచ్చే దొంగలుగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే నిజంగా ఎన్నికల నేపథ్యంలో వైన్ షాప్ లు బంద్ చేస్తారా? లేక కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక వైన్ షాప్ లు బంద్ చేస్తే వచ్చే ఆదాయం నష్టపోతామని వైన్ షాపు సంఘం ప్రతినిధులు వాపోతున్నారు. ఇప్పుడేమో ఎన్నికల సీజన్, దానికితోడు లక్షలు డబ్బులు సీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న సిచువేషన్ లో వైన్ షాపు సంఘం ప్రతినిధిలు ఒకవేళ డబ్బులు తీసుకుని పట్టుబడి వాటి ఆధారాలు చూపించిన ప్రయోజనం లేదు కాబట్టి వచ్చే ఆదాయం, లాభం దేవుడెరుగు గానీ, డబ్బులు మాత్రం పోయేదే ఉంటుందని అధికారుల అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం వైన్ షాప్ లకే కాదు.. 50 వేలకు మించి డబ్బులు ఎక్కడ కనపడినా అవి సీజ్ చేయడం పక్కా. అందుకని కొందరు డబ్బులు తీసుకుని వెళుతున్నప్పుడు అలర్ట్ ఉంటే మంచిది మరి.
Telangana Govt: ఆరోజు వేతనంతో కూడిన సెలవు.. పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం