రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వివిధ శాఖల్లోని పోస్టులు.. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరిల వారీగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ విభజన చేసింది.. ఏ పోస్ట్ ఏ కేటగిరి కిందకు వస్తుందో క్యాడర్ ని విభజిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. మిగతా పోస్టులు జోనల్, మల్టీ జోనల్ పోస్టులు పేర్కొంటూ.. 84 జీవోను జారీ చేసింది ప్రభుత్వం.. కొన్ని లోకల్ క్యాడర్ పోస్టులు, జోనల్ పోస్ట్ లుగా మార్పు చేశారు.. స్టేట్ క్యాడర్ పోస్టులు మల్టిజోనల్ పోస్టులుగా మార్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖల్లో క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయం… క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల కేటాయింపు… కొత్త పోస్టుల మంజూరు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఖాళీలపై స్పష్టత రానుంది.. మొత్తం 87 విభాగాధిపతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోస్టుల కేడర్ వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో పోస్టుల వర్గీకరణ..
TS Government