NTV Telugu Site icon

MOONSHINE P.U.B.: ఫిలింనగర్‌లోని మూన్‌షైన్‌ పబ్ లో గొడవ.. యువతి విషయంలో ఘర్షణ..

Moonshine P.u.b

Moonshine P.u.b

MOONSHINE P.U.B.: వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఫిలిం నగర్ మూన్ షైన్ పబ్ మారుతుంది. ఇటీవలే మూన్ షైన్ పబ్ పార్కింగ్ ప్లేస్ లో గంజాయి విక్రయిస్తుండగా యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మరువక ముందే మూన్ షైన్ పబ్ లో నిన్న అర్దరాత్రి యువతి విషయంలో మందుబాబుల మధ్య చెలరేగిన ఘర్షణ చోటుచేసుకోవడంతో మూన్ షైన్ పబ్ పై పోలీసుల నిఘా పెట్టారు.

Read also: Faria Abdullah : ”జాతి రత్నాలు” సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన చిట్టి..?

అసలు ఏం జరిగింది..

హైదరాబాద్ ఫిలింనగర్ లోని మూన్‌షైన్‌ పబ్‌లో అర్థరాత్రి మందుబాబుల మధ్య గొడవ జరిగింది. పబ్‌కు వచ్చిన యువతితో కలిసి మందుబాబు మద్యం తాగుతుండగా..మరో యువకుడు ఆ యువతితో కలిసి డ్యాన్స్ చేయసాగాడు. తన గర్లఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తుండంతో మందుబాబు అతన్ని నెట్టివేశాడు. తాను మద్యం తాగించిన యువతితో డ్యాన్స్ ఎందుకు చేస్తున్నావంటూ మందుబాబును అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మందుబాబును మందలించడంతో రెచ్చిపోయిన ప్రత్యర్థి వర్గం మూకుమ్మడిగా కలిసి దాడికి పాల్పడ్డారు. తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడటంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. వీరంతా బడాబాబుల పిల్లలుగా పోలీసులు గుర్తించారు. వారు ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. దర్యాప్తు జరుగుతుందని అన్నారు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టారు.
KCR: నేడు వరంగల్‌ లో కేసీఆర్‌ బస్సుయాత్ర.. హనుమకొండ చౌరస్తాలో ప్రసంగం..

Show comments