సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్నారు జస్టిస్ ఎన్.వి రమణ. ఈ సందర్బంగా యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద ఎన్వీ రమణకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. దర్శనం అనంతరం ఆలయంలో జస్టిస్ ఎన్వి రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం పనులను వీక్షించి ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో చేపట్టిన నిర్మాణ పనులు మరియు ప్రెసిడెన్షియల్ బిర్లా కాంప్లెక్స్ పనులను జస్టిస్ ఎన్వి రమణ పరిశీలించారు. ఇక ఎన్వీ రమణతో పాటు తెలంగాణ సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై పాల్గొనాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ యాదాద్రి రాలేకపోయారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు..
