Illegal Affair: వారిద్దరు ఉన్నత స్థాయి అధికారులు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి వారే తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు ci వ్యవహారం వివాదాస్పదం అయ్యింది.. ఓకే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఓ మహిళ సీఐతో అత్యంత సన్నిహితంగా ఉండడం గుర్తించి మహిళా సిఐ భర్త ఇద్దరు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. ఈ ఇద్దరి తీరు పైనా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ తో పాటు మహిళ ci ని ఇద్దరినీ సుబేదారి పోలీస్ స్టేషన్లో విచారించిన పోలీసులు భర్త సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. భార్యాభర్తల బంధాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ సిఐ ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
Read also: Mars Orbiter Mission: మూగబోయిన “మంగళయాన్”.. సంబంధాలు కోల్పోయామన్న ఇస్రో
సుబేదారీ సీఐ ఎండీ షుకుర్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ రాంనగర్‌కు చెందిన ఓ మహిళా సీఐ వరంగల్ సీఐడీ కార్యాలయంలో పనిచేస్తోంది. అక్కడే బలభద్ర రవి అనే మరో ఇన్‌స్పెక్టర్ కూడా పనిచేస్తున్నాడు. వీరి మధ్య చనువు పెరిగింది. ఇద్దరు ఒకరి ఇంటికి మరొకరు వెళుతున్నారు. దీనిపై మహిళా సీఐ భర్తకు అనుమానం వచ్చింది. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ జిల్లాలో రూరల్ సీఐగా పని చేస్తున్నాడు. వారిని పట్టుకోవాలని చాలాకాలంగా వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మహిళా సీఐ ఇంటికి బలభద్ర రవి వచ్చాడు. వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సీఐ భర్త తన మిత్రులతో కలిసి వచ్చి వారిద్దర్నీ నిలదీశాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తాము ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నామని వారు చెప్పారు. అయినా వారిద్దర్నీ మహిళా సీఐ భర్త, అతని మిత్రులు కట్టడి చేసి, సుబేదారీ పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి రవిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా సీఐ భర్త ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. రవి తన ఇంటికి అనుమతి లేకుండా వస్తున్నాడని, అడ్డుకున్న తనను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహిళా సీఐ, మరో సీఐ బలభద్ర రవి మధ్య ఎలాంటి సంబంధం ఉందనేది దర్యాప్తు చేస్తున్నామని సీఐ షుకుర్ తెలిపారు.
Mars Orbiter Mission: మూగబోయిన “మంగళయాన్”.. సంబంధాలు కోల్పోయామన్న ఇస్రో