NTV Telugu Site icon

CI Muthu Yadav: లోకో పైలెట్ మిస్సింగ్.. అందువల్లే ఆచూకీ తెలియలేదన్న సీఐ

Ci Muthu Yadav

Ci Muthu Yadav

CI Muthu Yadav Clarity on Locopilot Vasavi Missing Case: సికింద్రాబాద్‌ లో అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ మిస్సింగ్ మిస్టరీగా మారింది. లోకో పైలెట్ మిస్సింగ్ కేసు నమోదై సుమారు 50 రోజులు గడుస్తున్నా ఇంకా ఛేదించక పోవడంపై లోకో పైలెట్‌ వాసవీ తల్లిదండ్రులు మీడియా ముందుకు రావడంతో.. దీనిపై సనత్‌నగర్ సీఐ ముత్తూ యాదవ్ NTV తో మాట్లాడారు. అసిస్టెంట్ లోకో పైలట్ వాసవి ప్రభ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని స్పష్టం చేశారు. ఆమె తన వెంట ఎలాంటి ఏటీఎం, సెల్ ఫోన్ కానీ తీసుకెళ్లకపోవడంతో ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందికరంగా మారిందని అన్నారు. భరత్ నగర్ వరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిన సీసీ ఫుటేజ్ ఒకటే ఉందని.. భరత్ నగర్ నుండి సిసి కెమెరాలు పని చేయడం లేదని సీఐ మీడియాకు తెలిపారు. కాబోయే భర్తను కూడా మూడుసార్లు స్టేషన్ కి పిలిపించి విచారించామన్నారు. ఆమె తోటి ఉద్యోగులను కూడా విచారించామని వెల్లడించారు. వాసవి ప్రభకు సంబంధించిన ఆచూకీ లభిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని సనత్‌నగర్ సీఐ ముత్తూ యాదవ్ కోరారు.

Read also: BIG Breaking: రామ్‌గోపాల్‌ పేట్‌ లో భారీ అగ్నిప్రమాదం.. డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్టోర్‌ లో మంటలు

నవంబర్ 30 తేదీన ఇంటి నుండి వెళ్లి పోయిందని వాసవీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇటీవలే సంచిత్ సాయి అనే వ్యక్తి తో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 11 తేదీన వివాహం కోసం వాసవీ ప్రభ షాపింగ్ చేసింది. అంతవరకు బాగానే వున్న వారిఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ.. వాసవీ ప్రభ ఇంట్లో మొబైల్ వదిలేసి అదృశ్యమైంది. ఇంట్లోనే తన ఐడి కార్డు, మొబైల్ ఫోన్, ఏటిఎం కార్డు, ఆధార్ కార్డులను వాసవి వదిలేసి వెళ్ళిపోవడం కలకలం రేపుతుంది. పెళ్లి చేసుకోబోయే సంచిత్ సాయితో గొడవ పడినట్లు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఇంటికి రావాలని వాసవీ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. నీకు ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి చేస్తామని, ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలని తల్లిదండ్రులు ఆవేడుకుంటున్న తీరు అందరినీ కలిచి వేస్తోంది. గత ఏడాది జులై 15 తేదీ నుండి సికింద్రాబాద్ లో అసిస్టెంట్ లోకో పైలెట్ గా విధులు నిర్వహిస్తున్న వాసవీ ప్రభ.. డిసెంబర్ 5 నుండి పెళ్ళి కోసం సెలవులు పెట్టింది. ఇటు ఉద్యోగానికి రాక, అటు కనిపించక పోవడంతో పేరెంట్స్ ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు వాసవి పేరెంట్స్‌. తనకూతురిని తొందరగా తమ వద్దకు చేర్చాలని వేడుకున్నారు.
Assistant Loco Pilot: లోకో పైలెట్ మిస్సింగ్ మిస్టరీ.. యాభై రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ