NTV Telugu Site icon

Chit Fund: చిట్ ఫండ్స్ కావవి చీటింగ్‌ ఫండ్స్‌.. తస్మాత్ జాగ్రత్త!

Kanakadurga Chifound

Kanakadurga Chifound

Chit fund cheating: మీరు ప్రైవేట్ చిట్టీలు చేస్తున్నారా? చిట్ ఫండ్ కంపెనీల్లో డబ్బు కడుతున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, వ్యక్తులు లేదా సంస్థలు లక్షలు, కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే దుకాణం మూసేసి పారిపోయే అవకాశం ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో చిట్టీలు కట్టడం, పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం డబ్బు ఆదా చేయడం కోసం చిట్ ఫండ్ కంపెనీల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం మామూలే. ఏ గ్రామంలో చూసినా అనధికారికంగా చిట్టీ లావాదేవీలు నిర్వహించే వారు మూకుమ్మడిగా కనిపిస్తున్నారు. పైగా దాదాపు అన్ని పట్టణాల్లో ఈ అనధికారిక చిట్టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ చిట్టి వ్యవస్థ సమాజంలో బాగా పాతుకుపోయింది. సహజంగానే, వాపసు గడువు వచ్చినప్పుడు ఈ ఏజెంట్లు అదృశ్యమవుతారు. అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Sundeep Kishan : రెజీనాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సందీప్ కిషన్

సిద్దిపేట జిల్లాలో ఖాతాదారులకు చిట్ ఫండ్ కంపెనీలు ఇబ్బందులు పెడుతున్నాయి.15 రోజుల క్రితమే ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా SR రియల్ ఎస్టేట్ సంస్థ ఇబ్బందులు పెట్టిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు కనకదుర్గ చిట్ ఫండ్ కంపెనీ వంతైంది. బాధితుడు ప్రభాకర్ రెడ్డి చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఐదు నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నాడు. కనకదుర్గ చిట్ ఫండ్ లో 20 లక్షల చిట్టి 50 నెలలకు వేసిన బాధితుడు ప్రభాకర్. 27 నెలల నుంచి చిట్టి డబ్బులు కడుతూ ప్రభాకర్ ఆగస్ట్ లో చిట్టి ఎత్తుకున్నాడు. కనకదుర్గ చిట్ ఫండ్ యాజమాన్యం ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఆఫీస్ కి వెళ్లి ఆందోళన చేస్తే క్యాష్ బదులు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో సాక్‌ తిన్నాడు ప్రభాకర్‌. డబ్బు అవసరమని డబ్బే కావాలని అడగడంతో.. చిట్‌ ఫండ్‌ యాజమాన్యం ససేమిరా అన్నారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ప్రభాకర్ రెడ్డి చిట్ ఫండ్ కంపెనీపై ఫిర్యాదు చేయడంతో అసలు భాగోతం బయటకు వచ్చింది. అందుకే ఇలాంటి అనధికారిక టికెటింగ్ వ్యవస్థలకు దూరంగా ఉండటం మంచిది. అవతలి వ్యక్తులకు ఎంత పేరున్నా ఇటువంటి చిట్టీలు డిపాజిట్ల జోలికి పోకుండా ఉండడమే మంచిది అని పోలీసులు చెబుతున్నారు.
Sasana Sabha Review: శాసన సభ మూవీ రివ్యూ