Child Kidnapping: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం ఘటన మరువక ముందే ఘట్‌కేసర్‌లో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ స్థానికంగా సంచలంగా మారింది. మేడ్చల్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని కనిపించకుండా పోయింది. పాప కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండాపోయింది. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇంటిముందుకు ఆడుకుంటుందని ఇంతలోనే ఎక్కడికి వెళ్లిందో తెలియటం లేదని వాపోయారు. మా పాపను సురక్షితంగా వారి వద్దకు చేర్చాలని కన్నీరుపెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాపను తెలిసిన వారే కిడ్నాప్ చేశారా? అక్కడ వున్న సీసీ ఫుటేజ్ ను ఆధారంగా చిన్నారిని జాడను కనిపెట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Salaar Teaser: ‘సలార్’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!
నిన్న పెద్ద అంబర్ పేట్ హైవే చెక్ పోస్ట్ సమీపంలో బైక్ పై ఓ బాలిక వెళుతున్న క్రమమంలో ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి అక్కడినుంచి హైవే పక్కకి లాక్కుని వెళ్లారు. తనపై అత్యాచారం చేశారు. ఆ ఇద్దరి యువకుల నుంచి బాలిక తప్పించుకొని రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి వెళ్లే వారికి హెల్ప్ అంటూ అడిగినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. నిస్సహాయ స్థితిలో రోడ్డుపై సహాయం కోసం అరుస్తున్న బాలికను చూసిన ఓ హిజ్రా చలించిపోయాడు. పరుగున ఆ బాలిక వద్దకు వచ్చి ఏం జరిగింది అని అడగగా జరిగిన విషయాన్ని ఆ హిజ్రాకు చెప్పింది. హిజ్రా వద్ద వున్న ఫోన్ తీసుకుని ఆ బాలిక తన అన్నకు కాల్ చేసింది. వెంటనే ఘటన స్థలానికిబాలిక తల్లిదండ్రులు.. పోలీసులు.. చేరుకున్నారు. యువకుల నుంచి తప్పించుకునే సమయంలో బాలిక తీవ్రంగా గాయాలయ్యాయి. బాలికను హయత్ నగర్ మ్యాక్సీ క్యూర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
Ap Rains : ఏపీలో భారీ వర్షాలు..ఆ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు..