Site icon NTV Telugu

Hyderabad: నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం.. 16 గంటలు గడిచినా దొరకని ఆచూకీ

Kid Nignap Hyderabad Nelophar Hospatel

Kid Nignap Hyderabad Nelophar Hospatel

Hyderabad: నీలోఫర్ ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతుంది. చిన్నారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 16 గంటలు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాబు కనిపించకపోవడంతో కన్న తల్లి రోదనలు వినిపిస్తున్నాయి. తన కొడుకును తనకు అప్పగించాలంటూ ఆమె ఆందోళన చెందుతోంది. నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నీలోఫర్‌ ఆస్పత్రి నుంచి 6 నెలల బాబు పైసల్‌ఖాన్‌ను ఓ మహిళ అపహరించింది. గండిపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పైసల్‌ఖాన్‌ దంపతుల రెండో కుమారుడు. పెద్ద బాబుకు నిద్ర పట్టకపోవడంతో నిన్న మధ్యాహ్నం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం బాబు చికిత్స పొందుతుండగా, రెండో బాబుతో కలిసి మొదటి అంతస్తు వార్డులో అతని తల్లి ఫరీదా భేగం కూర్చున్నారు. అక్కడ పసుపు కండువా కట్టుకుని క్రీమ్ కలర్ నైటీ వేసుకున్న ఓ మహిళ ఫరీదా బేగం వద్దకు వచ్చింది. తర్వాత ఫరీదా బేగంతో కలిసి వివిధ అంశాలపై మాట్లాడింది. అదే సమయంలో భోజనం వడ్డిస్తున్నామని తల్లి ఫరీదాబేగం భోజనం చేసేందుకు వెళ్లింది. ఫరీదా బేగం ఆ మహిళకు బాబును చూడమని చెప్పి వెళ్లిపోయింది.

Read also: BJP Bike Rally: హైదరాబాద్‌లో బీజేపీ బైక్‌ ర్యాలీ.. పాల్గొన్న కిషన్‌రెడ్డి

అప్పటి వరకు మాట్లాడిన మహిళ ఫోన్ చూపించి అబ్బాయిని తీసుకుని వెళ్లిపోయింది. తల్లి ఫరీదాబేగం భోజనం తీసుకొని వచ్చి చూసే లోపు ఆ మహిళతో పాటు బాబు ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో మహిళ మీ బాబు ఆమె తీసుకుని వెళ్లిపోయిందని చెప్పడంతో అని చెప్పింది. అయితే ఆమె మీ బంధువు అనుకున్నానని అందుకే తీను మీ బాబును తీసుకుని వెళుతున్న ఏమీ ప్రశ్నించలేక పోయానని తెలిపింది. ఫరీదా ఆసుపత్రి వారికి చెప్పిన ఎవరూ స్పందించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటా హుటిన ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఫరీదా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మరోవైపు ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో కేసు క్లిష్టంగా మారింది. తన బిడ్డను అప్పగించాలంటూ తల్లి ఫరీదా బేగం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
BJP Bike Rally: హైదరాబాద్‌లో బీజేపీ బైక్‌ ర్యాలీ.. పాల్గొన్న కిషన్‌రెడ్డి

Exit mobile version