Site icon NTV Telugu

CM KCR for Yadadri: పనుల పరిశీలనకు రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌..

Cm Kcr For Yadadri

Cm Kcr For Yadadri

CM KCR for Yadadri: వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వెలుగులు పంచనుంది. ఇది దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో మొదటిది. ఈ నేపథ్యంలో యాదాద్రి నిర్మాణ పనులపై రాష్ట్ర జెన్‌కో పురోగతి నివేదికను అందజేసింది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్​ సోమవారం పరిశీలించనున్నారు. ఈనేపథ్యంలో.. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్​ కూడా వచ్చే అవకాశం ఉందని ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. ఇక, రాష్ట్ర అవసరాలకు యాదాద్రి విద్యుత్‌ కేంద్రం కీలకమని, దీని నిర్మాణపనులను రాత్రింబవళ్లు పదివేల మంది కార్మికులు శరవేగంగా చేస్తున్నట్లు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. అయితే.. దీనికిచ్చిన పర్యావరణ అనుమతిని సమీక్షించి తిరిగి నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు నిర్మాణానికి ఆటంకం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ.. నిర్మాణం ఆపాలని ఎన్​జీటీ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Read also: Fire Accident: ఢిల్లీ భగీరథ్ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇది. దీంతో.. తొలుత కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్త ప్లాంటును రికార్డుస్థాయిలో 48 నెలల్లో నిర్మించి విద్యుదుత్పత్తిని జెన్‌కో ప్రారంభించింది. అనంతరం ఆ తరవాత భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద 1080 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మరో ప్లాంటును భద్రాద్రి పేరుతో చేపట్టి ఉత్పత్తి ప్రారంభించింది. అయితే.. ఈ వరుసలో మూడో ప్లాంటు యాదాద్రి పేరుతో దామెరచర్ల వద్ద చేపట్టింది. యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణాన్ని సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈనిర్మాణం పూర్తయితే రాష్ట్ర అవసరాలకు కరెంటు కొరత ఉండదని ప్రభుత్వ అంచనా వేస్తోంది. అయితే.. వచ్చే ఏడాది 2023 డిసెంబరు నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో.. ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం జెన్‌కోకు సూచించారు. యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించడానికి ఈ నెల 28న వస్తానని ముఖ్యమంత్రి చెప్పడంతో జెన్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Ayyappa Swami Irumudi: అయ్యప్ప స్వాములు తీసుకోళ్లే ఇరుముడి దేనికి ప్రతీక

Exit mobile version