స్వామియే శరణం అయ్యప్ప

మండల దీక్ష పూర్తైన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకుని బయల్దేరుతారు స్వాములు

ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక.

ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్దలను సాధనతో పొందగలిగితే. స్వామి అనుగ్రహం అభిస్తుందని అందులో ఆంతర్యం

జీవాత్మ, పరమాత్మలనుఅనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామి వారికి అభిషేకం చేస్తారు.

ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.

అయ్యప్ప పూజలో ప్రధానాంశం శరణుఘోష. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్నిస్తుందని చెబుతారు.

శరణాగతి వేడిన భక్తుల బాగోగులు స్వయంగా దేవుడే చూసుకుంటాడని విశ్వాసం.

అన్నింటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమో గుణానికి ప్రతీక.

తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షధారుడి హృదయం పరమాత్మలో విలీనం అవుతుంది.

దీక్ష విరమించిన వెంటనే మళ్లీ పాత అలవాట్లను లోబడితే ఆ దీక్ష ధారణకు అర్థం, సార్థకం లేనట్టే..

మాల విరమించినా నియమాలు లేకున్నా.. వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత..