NTV Telugu Site icon

Chicken prices: తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్‌ రేట్లు

Chiken Rate

Chiken Rate

Chicken prices: వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా, వారం రోజులుగా ఎండలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వాతావరణంలో హెచ్చుతగ్గుల కారణంగా కోళ్లు చనిపోతుండటంతో దీని ప్రభావం చికెన్ ధరలపై చూపుతుంది. కేవలం నెల రోజుల్లోనే చికెన్ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 1న కేజీ చికెన్ ధర రూ.154 ఉండగా, ప్రస్తుతం రూ.200కి చేరింది. శుక్రవారం మార్కెట్‌లో స్కిన్‌తో కూడిన చికెన్‌ కిలో రూ.213 పలుకుతోంది. కాగా స్కిన్ లెస్ చికెన్ ధర రూ. నెల క్రితం కిలో 175 ఉండగా ఇప్పుడు రూ. 243కి చేరగా.. ఏప్రిల్ 1న రూ.84 ఉన్న ఫామ్ చికెన్ గురువారం నాటికి రూ.125కి పెరిగింది. స్కిన్‌తో కూడిన చికెన్‌ ధర ఏప్రిల్‌ 1న రూ.154, ఏప్రిల్‌ 15న రూ.175, మే 1న రూ.186, మే 18న రూ.213కి పెరగగా.. స్కిన్‌లెన్‌ చికెన్‌ కేజీ ధర ఏప్రిల్‌లో రూ.175గా ఉంది.

Read also: Toor dal rates hiked: కదంతొక్కిన కందిపప్పు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్‌..!

ఏప్రిల్ 15న రూ.200, మే 1న రూ.211, మే 18న రూ.243. ఫామ్ చికెన్ ధర ఏప్రిల్ 1న రూ.84, ఏప్రిల్ 15న రూ.95, మే 1న రూ.106, మే 1న రూ. మే 18న రూ.124కి చేరగా.. వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా 40 నుంచి 60 శాతం కోడిపిల్లలు చనిపోతాయని, చికెన్ ధరలు పెరగడానికి ఇదే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కోళ్ల దాణా, రవాణా ఖర్చు కూడా భారీగా పెరిగిందని, అది కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు. ప్రతి ఏటా ఎండాకాలంలో చికెన్‌ ధరలు పెరుగుతాయి. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని అంటున్నారు. చికెన్ ధరలు క్రమంగా పెరగడంతో నాన్ వెజ్ ప్రియులు హర్షం వ్యక్తం చేయడం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ షాపుల ముందు నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మిగతా రోజుల్లో కూడా నాన్ వెజ్ అమ్మకాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొంత మంది తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. రేట్లు ఎక్కువగా ఉండడంతో సామాన్యులు సైతం కోడి కొనుగోళ్లకు వెనకడుగు వేస్తుంటే.. మరి కొంతమంది చికెన్ ప్రియులు మాత్రం గత్యంతరం లేక కొనుగోలు చేస్తున్నారు.
Traffic Restrictions: నేడు కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు