NTV Telugu Site icon

Mahankali Bonalu: మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి.. షార్ట్ సర్క్యూట్ తో వ్యక్తి మృతి

Bonalu

Bonalu

Mahankali Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా.. బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కరెంట్ స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో.. దానికి తగిలి మృతి చెందాడు. ఈ సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Read also: China: కిండర్‌గార్టెన్‌పై యువకుడి దాడి.. కత్తిపోట్లతో ఆరుగురు మృతి

కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ బేగంబజార్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి వర్షం కురవడంతో మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చోట ఆగాడు. పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభానికి కరెంట్‌ సరఫరా అవుతుండగా ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే గంతలో కూడా ఓ వ్యక్తి ఇదే విద్యుత్ స్తంభానికి తగిలి షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
Rajasthan: భర్త ఉద్యోగం కోసం ఇద్దరు భార్యల మధ్య గొడవ.. ఒకరి దారుణ హత్య

Show comments