Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Change In Telangana School Timing

TS School Timing: స్కూల్ టైమింగ్స్‌లో మార్పు.. విద్యాశాఖ కసరత్తు..!

Published Date :June 24, 2023 , 1:42 pm
By NTV WebDesk
TS School Timing: స్కూల్ టైమింగ్స్‌లో మార్పు.. విద్యాశాఖ కసరత్తు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana School Timing: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల వేళలను మార్చాలని విద్యాశాఖ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు తెరిచి ఉంటాయి. హైదరాబాద్‌లో అయితే పాఠశాలలు కొంత సమయం ముందుగానే ప్రారంభమవుతాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు, పొద్దున్నే నిద్రలేవరని ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు తెరవాలని పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద పిల్లలు హైస్కూళ్లలో చదువుతున్నందున ఉదయం 9గంటలకే పాఠశాలను ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం స్కూల్ టైమింగ్స్ విరుద్ధంగా ఉన్నాయని.. అందుకే వాటిని మార్చాలని కోరుతున్నారు. అన్ని పాఠశాలలు ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని వారు సూచిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు వేళల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువు తర్వాత పాఠశాల సమయాల్లో మార్పులు ఉండవచ్చు.

Read also: బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. శ్రీలీలా, కృతి మధ్య ఇదే తేడా!

మరోవైపు పాఠశాలల సమయాలను మార్చే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులతో చర్చించడంతోపాటు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 7.30 గంటలకే చిన్న పిల్లలను వాహనాల్లో ఎక్కించుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు ఉదయం 9 గంటలకు ముందే వెళతారని చెబుతున్నారు. పాఠశాలలు ఆలస్యంగా తెరిస్తే ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. వీలైనంత త్వరగా తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు పాఠాలు బాగా అర్థమవుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హైస్కూల్‌కు పక్క గ్రామాల నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారని, అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తున్నారని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు గ్రామంలోనే ఉండడంతో ఆలస్యంగా తెరవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల సమయపాలనకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Telangana BJP: రాజధానికి రండి.. కిషన్‌ రెడ్డి, ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ పిలుపు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Change in Telangana School Timing
  • Telangana School
  • Telangana School Timing
  • Telangana School Timing Change

తాజావార్తలు

  • Vetrimaran : రియలిస్టిక్ సినిమాలకు బ్రాండ్ డైరెక్టర్ వెట్రిమారన్

  • Oscars: ఆస్కార్ ముచ్చట్లు.. 3.8 కేజీల బరువు.. 500 కోట్ల ఖర్చు! ఆస్కార్ వెనకున్న క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే

  • B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!

  • BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మరో వివాదం.. వైడ్ బాల్‌కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!

  • Telangana Thalli Statue: అసెంబ్లీలో కొలువుదీరిన ‘తెలంగాణ తల్లి’.. ఆవిష్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions