ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపదానికీ అభ్యంతరం లేదని చంద్ర బాబు స్పష్టం చేయాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నప్పుడే రెండు రాష్ట్రాలు రాజకీయాలు ప్రక్కన పెట్టి వారిని కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కాపాడాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవటానికే రెండు ప్రభుత్వాలు ఉద్దేశ్యం పూర్వకంగానే ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. మునిగిన ప్రాంతాలు కాపాడుకోవడం విస్మరించి రెండు రాష్ట్రాల మంత్రులు ఉద్దేశ్య పూర్వకంగానే విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ లోకి ఐదు గ్రామాలను కలిపే అంశంపై CPI పార్టీ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఇన్వెస్టగేషన్ ఏజన్సీలు మోడీకి అనుకూలంగా వ్యవరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. వరద ముంపు ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని పేర్కొన్నారు. కేంద్రాన్ని రెండు రాష్ట్రలు జాతీయ విపత్తుగా గుర్తించాలని అడగాలని డిమాండ్ చేసారు. ఐదు గ్రామాలను తెలంగాణలో రావటానికి ఎటువంటి అభ్యతరం లేదని చంద్రబాబు తెలిపాలని సంచలన వ్యాఖ్యలు చేసారు. సీపీఐ నారాయణ.
read also: Madala Ravi Birthday Special : నాన్న బాటలో నడచిన మాదాల రవి!
వరద ప్రభావంతో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన వివిధ గ్రామాల వాసులు తమను తెలంగాణలో కలపాలంటున్నారు. తెలంగాణ సహకారం లేకపోతే మా ప్రాణాలు నట్టేట్లో కలిసి పోయేవని గుండాల వాసులు అంటున్నారు.హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా ,రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే ప్రధానమైన రహదారి పక్కనే గుండాల గ్రామం ఉంది. తెలంగాణ ప్రాంతం తమలో కలపాలని కోరుతున్న ఒక గ్రామంలో ఇది ఒక గ్రామం. అయితే.. కొద్ది రోజులుగా తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాల ప్రజలు జూన్ 24న భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైద్య, విద్య, వ్యాపారపరంగా ఏ విధంగా చూసినా గత కొన్ని దశాబ్ధాలుగా ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలతో కొనసాగిన అనుబంధమే తమకు అన్ని విధాల అనుకూలంగా ఉందని, రాష్ట్ర విభజనలో తమను ఏపీలో కలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలీన పంచాయతీల ప్రజలు ఆవేదన వక్తం చేస్తున్నారు. తమను తెలంగాణ పరిధిలోని భద్రాచలంతోనే కొనసాగాలని ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల వాసులు ముక్తకంఠంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
Madala Ravi Birthday Special : నాన్న బాటలో నడచిన మాదాల రవి!