Chance of rains in Telangana: ఏపీ కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా మేఘాలు కమ్ముకున్నాయని.. నేడు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయన్నారు. వాటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవాళ నల్గొండ, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Read also: Garlic Price Hike: రిటైల్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఘాటెక్కిన వెల్లుల్లి.. ఎంత పెరిగిందంటే ?
హైదరాబాద్‌లో శనివారం కావడంతో వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ఇటీవలి కాలంలో ఎండలకు కాస్త ఉలిక్కిపడిన నగర ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది. ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ నగర్ క్రాస్ రోడ్, అశోకాపోల్, అశోకాపోల్. నగర్, అబిడ్స్, కోఠి, లోయర్ ట్యాంక్ బండ్, హబ్సిగూడ, రామాంతపూర్, ఉప్పల్, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం ఇతర ప్రాంతాలు వర్షం అందుకుంది. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read also: Yashasvi Jaiswal: అదే నా బ్యాటింగ్‌పై చాలా ప్రభావం చూపింది: యశస్వి జైస్వాల్
జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో శనివారం 71 మి.మీ వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా నందనలో 53, ఖమ్మం జిల్లా లింగాలలో 43, రావినూతల, తిమ్మారావుపేటలో 42, మధిరలో 39, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనం కారణంగా ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో రేపు (ఆగస్టు 14) వర్షాలు పడే అవకాశం ఉంది.
CM KCR: మెదక్, సూర్యాపేటలో సీఎం పర్యటన.. తేదీ ఖరారు చేసిన సర్కార్
