Gutha Sukender Reddy: పేపర్ లీకేజ్ పదివేల కోట్ల స్కామ్ ఎట్లా అవుతుంది? పేపర్ లీకేజీ దాగే విషయం కాదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాకు పంచాంగం మీద నమ్మకం లేదని, నేను ఎప్పుడు జాతకం చెప్పించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో ఇంకా సుభిక్షంగా ఉండాలని, వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరికి ఆపాదిస్తారన్నారు. కానీ.. చైర్మన్ జనార్దన్ రెడ్డి గురించి నాకు తెలుసని, జనార్దన్ రెడ్డి నల్గొండ జిల్లాలో పని చేశారని, హనెస్ట్ పర్సన్ అని అన్నారు. గ్రూప్1లో ఇంటర్వ్యూలు వద్దని, పరీక్షలు పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు. వ్యవస్థను మొత్తంకు ఆపాదించడం దురదృష్టకరమన్నారు. పేపర్ లీక్ కు రాజకీయ రంగు పులమడం శోచనీయమని తెలిపారు. భవిష్యత్ ఉన్న రాజకీయ నాయకులకు బురదజల్లడం సరికాదని మండిపడ్డారు.
Read also: Revanth Reddy: రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష.. షాక్ లో ఉన్నానన్న రేవంత్ రెడ్డి
సిట్ నోటీసులు క్రిమినల్ నోటీసులు కాదని, ఆరోపణలు చేసిన వారి దగ్గర ఆధారాలు ఉంటే చూపించొచ్చు కాదంటే వదిలేస్తే సరిపోతుందన్నారు. పేపర్ లీకేజ్ పదివేల కోట్ల స్కామ్ ఎట్లా అవుతుంది? పేపర్ లీకేజీ దాగే విషయం కాదన్నారు. ఏ చిన్న విషయం దొరికినా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలకు ఆధారాలు ఉండవని అందరికి తెలుసన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను రద్దు చేస్తే బాగుంటుందా? సీబీఐ ఎన్ని కేసులు పరిష్కరించిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంతో మంది మంచి అధికారులు ఉన్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియొద్దని అన్నారు. ప్రాంతీయ తత్వాలు అధికారులకు ఆపాదించొద్దని అన్నారు. ఉద్యమ సమయంలో అవన్ని బాగున్నాయి.. ఇప్పుడు ఇది సరికాదన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలను తొందరగా భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారని తెలిపారు.
Read also: Karimnagar Crime: తండ్రిపై కొడుకు దాడి.. బ్యాట్ తో కిరాతకంగా కొట్టి..
సైబర్ క్రైమ్ ఎక్కువ అయిన మాట వాస్తవమే.. ఎవరిని పట్టుకుంటావ్..ఎలా పట్టుకుంటావ్ అనేది విశ్వాసంతో నడువాలన్నారు. గవర్నర్ బిల్స్ ఆపిన పరిస్థితి గతంలో లేదన్నారు. గవర్నర్ కి అభ్యంతరాలు ఉంటే తిరిగి పంపాలని అన్నారు. అలా ఆపితే ప్రభుత్వం పాలనకి ఇబ్బంది అవుతుందని తలిపారు. కామన్ రిక్యురిమెంట్ బిల్ కి ఆమోదం తెలిపితే పోస్టులు భర్తీ చేసే పక్రియ ప్రారంభం అయ్యేదని తెలిపారు. మనం చూసే మనసును బట్టి ఉంటుంది..గవర్నర్ ఎలా చూస్తే అలా కనిపిస్తుందని అన్నారు.
Heart Problems: జుట్టు నెరుస్తోందా.. మీ గుండె జాగ్రత్త