Site icon NTV Telugu

Chain Snatching: చిన్నారి ప్రాణం తీసిన చైన్‌ స్నాచర్‌

Chain Snatching

Chain Snatching

జనగామలో చైన్‌ స్నాచర్లు రేచిపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న మహిళలే టార్గెట్‌ గా వారి మోడలోంచి గొలుసులను లాక్కుని పరారవతున్నారు. ఇలాంటి ఘటనే జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కానీ.. చైన్‌ స్నాచర్‌ దురాగతానికి చిన్నారి బలైంది. అంబేడ్కర్‌ నగర్‌ లోని రోడ్డుపై వెళుతున్న ప్రసన్న అనే మహిళ మెడ నుంచి మంగళసూత్రం దొంగలించేందుకు దుండగడు ప్రయత్నించాడు. దీంతో ఆమె చోరీని అడ్డుకునేందుకు పెనులాటకు దిగింది. ఈ క్రమంలో అతను ఏం ఆలోచించాడో ఏమో గానీ.. మెడలోని చైన్‌ కోసం ఆమె చేతిలోని చిన్నారిని తీసుకుని పక్కనే వున్న నీటి సంపులో పడేసి వెళ్లి పోయాడు.

read also: YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసు.. హైకోర్టులో కీలక పరిణామం..

చైన్‌ స్నాచర్‌ దుండగుడి దుశ్చర్యకు షాకైన ప్రసన్న సంపులో పడిన పాపను రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది, విగత జీవిగా మిగిలింది. స్థానికుల సాయంతో నీటిసంపులో నుంచి పాప తేజస్వినిని బయటకు తీసి ఆతల్లి చిన్నారిని గుండెకు హత్తుకుని కన్నీరుమున్నీరు అయ్యింది. తన మంగళసూత్రం కోసం చూసుకుంటే తన కన్నబిడ్డ తనకు దూరమైపోయిందని గుండెలవిసేలా రోదించింది. ఆ తల్లి రోదనకు స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది కన్నీటి పర్వంతమయ్యారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చైన్‌ స్నాచర్ ను పట్టుకునేందు సీసీటీవీ పర్యవేక్షిస్తున్నారు. నిందితున్ని వీలైనంత త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

Exit mobile version