NTV Telugu Site icon

Munugode By Election Results: బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన సీఈవో వికాస్‌

Ceo Vikas Raj

Ceo Vikas Raj

Munugode By Election Results: మునుగోడు ఉప ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 8గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు రౌండ్‌ వరకు ఓట్లు లెక్కింపు ఊపందుకున్నా 4వ రౌండ్‌ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కాస్త జాప్యం ఏర్పడింది. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ లు సీఈవో తీరుపై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎందుకు జాప్యం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవార్తలపై స్పందించిన సీఈవో వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తాం మన్నారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. 47 మంది అభ్యర్థులు ఉన్నందున సమయం ఎక్కవ పడుతోందని చెప్పారు. ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారని అన్నారు. ఎన్నికల ఫలితాలు జాప్యం లేకుండా వెల్లడిస్తున్నామని అన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నామన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 8గంటల నుంచి మొదలైన మొదటి, రెండు, మూడు, రౌండ్లు త్వరగా వెల్లడించారని నాలుగో రౌండ్ నుంచి ఎందు జాప్యం వస్తుందని,  టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను సీఈవో అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో ఎందుకు వెల్లడించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు? అని ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

మధ్యాహ్నం కావస్తున్నా.. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ఫలితాలే వెల్లడి అయ్యాయి.. ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదో చేస్తుందనే అనుమానాలు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. రౌండ్లవారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి… కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందిస్తున్నారన్న వార్తలపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్‌ చేశారు.. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి.